DK Aruna: హైదరాబాద్ పోలీసులపై మండిపడ్డ డీకే అరుణ

DK Aruna fires on Revanth govt

  • ఏబీవీపీ కార్యకర్త ఝాన్సీని లాక్కెళ్ళిన పోలీసులపై మండిపాటు
  • బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శ
  • సదరు పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్

ఏబీవీపీ కార్యకర్తపై హైదరాబాద్ పోలీపులు వ్యవహరించిన తీరు బాధాకరమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఆమెను జుట్టు పట్టుకుని లాక్కుపోయిన పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏబీవీపీ కార్యకర్త ఝాన్సీపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. దారుణంగా వ్యవహరించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఆ పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్ చేయాలని అన్నారు. పోలీసులు మానవతా దృక్పధంతో వ్యవహరించాలని అన్నారు. 

DK Aruna
BJP
Revanth Reddy
Congress
  • Loading...

More Telugu News