Priyamani: 'భామాకలాపం 2' నుంచి ఫస్టు సింగిల్ రెడీ!

Bhamakalapam 2 movie update

  • 'ఆహా'లో ఆదరణపొందిన 'భామాకలాపం'
  • ప్రధానమైన పాత్రల్లో ప్రియమణి - శరణ్య ప్రదీప్ 
  • సీక్వెల్ గా రూపొందిన 'భామాకలాపం 2'
  • డార్క్ క్రైమ్ కామెడీ జోనర్లో సాగే కథ


ప్రియమణి ప్రధానమైన పాత్రను పోషించిన 'భామాకలాపం' సినిమా, ఫిబ్రవరి 11 ... 2022లో 'ఆహా' ద్వారా ప్రేక్షకులను పలకరించింది. డార్క్ క్రైమ్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా, నాలుగు మిలియన్స్ కి పైగా వ్యూస్ ను రాబట్టి కొత్త రికార్డును నమోదు చేసింది. భోగవల్లి బాపినీడు - సుధీర్ ఈదర నిర్మించిన ఈ సినిమాకి అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించాడు.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'భామాకలాపం 2' నిర్మితమైంది. ప్రియమణి - శరణ్య ప్రదీప్ ప్రధానమైన పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు 'పరుగే వింత పరుగే' పాటను వదలనున్నారనే విషయాన్ని చెబుతూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

'భామాకలాపం' ఫస్టు పార్టులో అనుపమ (ప్రియమణి)కి ... ఇరుగు పొరుగు ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ధ్యాస ఉంటుంది. అదే ఆమె ఒక హత్య చేసేవరకూ తీసుకెళుతుంది. దానిని నుంచి బయటపడటానికి ఆమె ఏం చేస్తుందనే సన్నివేశాలకు కామెడీ టచ్ ఇస్తూ ఆ కథ నడుస్తుంది. ఇక సెకండ్ పార్టు ఎలా ఉంటుందనేది చూడాలి.

Priyamani
Sharanya Pradeep
Abhimanyu
  • Loading...

More Telugu News