Siddharth Roy: 'అర్జున్ రెడ్డి'ని గుర్తుచేసే 'సిద్ధార్థ్ రాయ్' ట్రైలర్!

Siddharth Roy trailer released

  • దీపక్ సరోజ్ హీరోగా 'సిద్ధార్థ్ రాయ్'
  • హీరోయిన్ గా తన్వి నేగి పరిచయం  
  • దర్శకత్వం వహించిన యశస్వి
  • 'అర్జున్ రెడ్డి'ను పోలిన కంటెంట్ 


ఒకప్పుడు ప్రేమకథలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పుడు ప్రేమపేరుతో ఉన్మాదాన్ని చూపించే సినిమాలకి ఆదరణ పెరిగిపోతోంది. అందువల్లనే ఈ తరహా కంటెంట్ తో వస్తున్న సినిమాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విపరీత ధోరణి కలిగిన వ్యక్తిగా హీరోను చూపిస్తూ రూపొందిన ఆ సినిమానే 'సిద్ధార్థ్ రాయ్'. 

'అతడు' సినిమాలో బ్రహ్మానందం తనయుడిగా చేసిన దీపక్ సరోజ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఆయన జోడీగా తన్వి నేగి కనిపించనుంది. యశస్వి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా ట్రైలర్ ను వదిలారు. ఈ ట్రైలర్ లో అభ్యంతరకరమైన డైలాగ్స్ ఉన్నాయి. బోలెడంత బోల్డ్ కంటెంట్ ఉందనే సంకేతాలు ఉన్నాయి. 

ఈ ట్రైలర్ చూస్తుంటే ఒకప్పుడు కన్నడ హీరో ఉపేంద్ర చేసిన సినిమాలు .. రాజశేఖర్ చేసిన 'ఓంకారం' .. ఆ మధ్య వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయి. హీరో లుక్ ... చేష్టలు కూడా 'అర్జున్ రెడ్డి'నే గుర్తుచేస్తుంటాయి. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.  

More Telugu News