Hanu Man: 'హను మాన్'లో ఆ ఫైట్ సీన్ కి 35 రోజులు పట్టిందట!

Hanu Man Movie Update

  • ఈ నెల 12న విడుదలైన 'హను మాన్'
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫైట్స్
  • డూప్ లేకుండా చేసిన తేజ సజ్జా 

తేజ సజ్జా హీరోగా చేసిన 'హను మాన్' సినిమా ఈ నెల 12వ తేదీన విడుదలైంది. తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, చాలా తేలికగా 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమా విజయంలో కథ .. కథనం .. గ్రాఫిక్స్ తో పాటు ఫైట్స్ ముఖ్యమైన పాత్రను పోషించాయి. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైట్ మాస్టర్ పృథ్వీ మాట్లాడాడు. 

" ఈ సినిమాలో హీరో .. సూపర్ హీరోగా కనిపిస్తాడు. అందువలన అతను చేసే ఫైట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. మాస్ ఆడియన్స్ విజిల్స్ వేసేలా పిల్లలు ఎంజాయ్ చేసేలా ఫైట్స్ ను కంపోజ్ చేయవలసి ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఫైట్స్ కంపోజ్ చేస్తూ వెళ్లాము. ప్రతి ఫైట్ ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాము" అని అన్నాడు. 

ఈ సినిమాలోని ప్రతి ఫైట్ ను కూడా డూప్ లేకుండా తేజ సజ్జానే చేశాడు. రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పినా వినిపించుకోలేదు. ఫైట్స్ చేసేటప్పుడు అతనికి చాలానే గాయాలయ్యాయి. అయినా లెక్కచేయకుండా ముందుకు వెళ్లాడు. క్లైమాక్స్ ఫైట్ పెర్ఫెక్ట్ గా రావడం కోసం 35 రోజుల పాటు కష్టపడ్డాం. ఇప్పుడు ఆ ఫైట్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటే మా కష్టాన్ని మరిచిపోతున్నాం" అని చెప్పాడు. 

Hanu Man
Teja Sajja
Amritha
Prashanth Varma
Pruthvi
  • Loading...

More Telugu News