Neru: 'దృశ్యం' సినిమాను గుర్తుచేసే మోహన లాల్ మూవీ 'నెరు'
- మోహన్ లాల్ హీరోగా చేసిన 'నెరు'
- మలయాళంలో హిట్ కొట్టిన మూవీ
- 'దృశ్యం' డైరెక్టర్ మలిచిన మరో కథ ఇది
- ఆసక్తిని రేకెత్తించే స్క్రీన్ ప్లే
మోహన్ లాల్ - జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన 'దృశ్యం' .. 'దృశ్యం 2' సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. మలయాళంలోనే కాదు విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ కథ - స్క్రీన్ ప్లే ఎక్కువ మార్కులను దక్కించుకున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఈ సినిమా విశేషమైన ఆదరణను దక్కించుకోగలిగింది. అందుకు కారణం .. ఒక మిడిల్ క్లాస్ తండ్రి .. తన కూతురును కాపాడుకోవడం కోసం .. తన ఫ్యామిలీని రక్షించుకోవడం కోసం ఏం చేశాడనేది ఆ కథ.
ఆ తరువాత ఇప్పుడు మళ్లీ మోహన్ లాల్ - జీతూ జోసెఫ్ కలిసి మలయాళంలో 'నెరు' అనే సినిమాను చేశారు. ఈ సినిమా కథ కూడా 'దృశ్యం' తరహాలోనే సాగుతుంది. అయితే 'దృశ్యం' కథలో పోలీస్ డిపార్టుమెంటు పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది. 'నెరు' సినిమా కథ కోర్టు చుట్టూ తిరుగుతుంది. అంధురాలైన ఓ యువతిపై ఓ శ్రీమంతుల కొడుకు అఘాయిత్యం చేస్తాడు. అతణ్ణి ఆ కేసు నుంచి బయటకి తీసుకురావడానికి మరికొందరు రంగంలోకి దిగుతారు.
కొన్ని కారణాల వలన ప్రాక్టీస్ కి దూరంగా ఉన్న ఒక లాయర్ ఆ కేసును తీసుకుంటాడు. డబ్బున్నవాళ్లు కూడా శిక్షించబడతారు .. నేరస్థులు అన్ని ఆధారాలను చెరిపేయలేరు అని నిరూపించే కథ ఇది. కోర్టు రూమ్ డ్రామా అయినప్పటికీ, ఎక్కడా బోర్ కొట్టకుండా మొదటి నుంచి చివరివరకూ కొనసాగే ఈ సినిమా, తెలుగు వెర్షన్ తో పాటు 'హాట్ స్టార్' లో అందుబాటులో ఉంది.