Nagashourya: యంగ్ హీరోల దూకుడులో కనిపించని నాగశౌర్య!

Nagashourya Special

  • లవర్ బాయ్ గా ఆకట్టుకున్న నాగశౌర్య
  • పాతిక సినిమాలకి చేరువలో ఉన్న హీరో  
  • కలిసిరాని యాక్షన్ కథలు 
  • ఫ్యామిలీ కంటెంట్ కరెక్ట్ అనే అభిప్రాయాలు 


టాలీవుడ్ యంగ్ హీరోల్లో అందగాడుగా నాగశౌర్యకి పేరుంది. లవర్ బాయ్ గా ఇక్కడ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోలు కొంతమందే కనిపిస్తారు. అలాంటి హీరోల జాబితాలో నాగశౌర్య పేరు ముందువరుసలోనే కనిపిస్తుంది. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం ఆయన సొంతం. అమ్మాయిలలో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. 

నాని .. రామ్ .. నితిన్ వంటి హీరోల నుంచి నాగశౌర్యకి గట్టిపోటీ ఉన్నప్పటికీ, తనడైన ప్రత్యేకతను కనబరుస్తూ ముందుకెళ్లాడు. తన ఖాతాలోనూ కొన్ని హిట్లు వేసుకున్నాడు. ఇటు సొంత బ్యానర్లోను ... అటు బయట బ్యానర్లలోను వరుసగా చేస్తూ పాతిక సినిమాలకి దగ్గర్లో పడ్డాడు. 'రంగబలి' తరువాత ఆయన సినిమాలకి సంబంధించిన అప్ డేట్స్ రావడం లేదు. 

లవర్ బాయ్ గా మంచి క్రేజ్ ఉన్న నాగశౌర్య, యాక్షన్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఆయన తీసుకున్న ఆ నిర్ణయం సరైనది కాదనే అభిప్రాయాలు వినిపించాయి. ఇక 'వరుడు కావలెను' .. 'రంగబలి' వంటి సినిమాలు ఆశించిన స్థాయిని అందుకోలేకపోయినా, ఆ తరహా కంటెంట్ ఉన్న సినిమాలలో ఆయనను ఆదరించడానికి ఫ్యామిలీ ఆడియన్స్ రెడీగానే ఉన్నారు. నాగశౌర్య ఇక స్పీడ్ పెంచడమే మంచిదేమో. 

Nagashourya
Actor
Tollywood
  • Loading...

More Telugu News