Miss Perfect: మళ్లీ ఇంతకాలానికి ఆడియన్స్ ముందుకు వస్తున్న బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్!

Miss Perfect Web Series Update

  • 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'తో అభిజిత్ ఎంట్రీ
  • 'బిగ్ బాస్ సీజన్ 4'తో వచ్చిన క్రేజ్
  • యూత్ లో పెరిగిన ఫాలోయింగ్ 
  • 'మిస్ పెర్ఫెక్ట్' సిరీస్ లో కీలకమైన రోల్ 
  • ఫిబ్రవరి 2 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్    


అభిజిత్ ... 'బిగ్ బాస్' షోను ఫాలో అవుతూ వస్తున్నవారికి ఈ పేరు బాగా తెలుసు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ పాల్గొన్నాడు. అప్పుడు హౌస్ లో అందరికంటే ఎక్కువగా మార్కులు కొట్టేశాడు. హౌస్ లో క్యూట్ గా .. హ్యాండ్సమ్ గా కనిపిస్తూ యూత్ ను తనవైపుకు తిప్పుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల ఓట్లను బాగానే కొల్లగొట్టాడు. 

ఆ తరువాత బిగ్ బాస్ సీజన్లు నడిచినా ఈ రేంజ్ లో యూత్ ను ఎవరూ ప్రభావితం చేయలేకపోయారు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అభిజిత్, ఆ తరువాత కూడా ఒకటి రెండు సినిమాలు చేశాడు. అయితే ఆయనకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం 'బిగ్ బాస్' అనే చెప్పాలి. ఆ షో తరువాత ఆర్టిస్టుగా ఆయన మరింత బిజీ అవుతాడని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. 

అలాంటి అభిజిత్ త్వరలో ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఆ వెబ్ సిరీస్ పేరే 'మిస్ పెర్ఫెక్ట్'. లావణ్య త్రిపాఠి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్, ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 'హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, లవ్ .. కామెడీ జోనర్లో నడుస్తుంది. ఈ సిరీస్ తో అభిజిత్ బిజీ అవుతాడేమో చూడాలి.

Miss Perfect
lavanya Tripathi
Abhijith
Vishwak
  • Loading...

More Telugu News