Dhanush: ఇక్కడ కూడా ఇద్దరు హీరోల మధ్య పోటీ తప్పలేదే!

- ఈ నెల 12న విడుదలైన 'కెప్టెన్ మిల్లర్'
- అదే రోజున థియేటర్లకు వచ్చిన 'అయలాన్'
- ఎక్కువ మార్కులు కొట్టేసిన శివకార్తికేయన్
- తెలుగులో రేపు విడుదలవుతున్న సినిమాలివే
తమిళనాట ధనుశ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. కథా పరంగా .. పాత్ర పరంగా .. లుక్ పరంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలను చేస్తూ ధనుశ్ ముందుకు వెళుతున్నాడు. ఇక అంత కాకపోయినా శివకార్తికేయన్ కి కూడా మంచి ఇమేజ్ ఉంది. ఆయన ఖాతాలో కూడా 100 కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఉన్నాయి. అలాంటి ఈ ఇద్దరు హీరోలు ఈ నెలలో .. ఒకే రోజున తమ సినిమాలతో పోటీ పడ్డారు.

ఈ రెండు సినిమాలు కూడా కంటెంట్ పరంగా పూర్తి వైవిధ్యభరితమైనవే. ధనుశ్ కి క్రేజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆయన సినిమాకంటే 'అయలాన్' ఎక్కువ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే 'అయలాన్' లో గ్రహాంతరవాసి రూపకల్పనపై విమర్శలను కూడా ఈ సినిమా ఎదుర్కొంటూనే ఉంది. అలాంటి ఈ రెండు సినిమాలు తెలుగులోనూ ఒకే రిలీజ్ డేట్ ను సెట్ చేసుకుని ఇక్కడ కూడా పోటీకి దిగుతుండటం విశేషం. రేపు ఈ రెండు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి.