Lanka Dinakar: ఆరోజు మీ అన్న వ్యవహరించిన తీరును మర్చిపోవద్దు: షర్మిలకు లంకా దినకర్ కౌంటర్

Lanka Dinakar counter to YS Sharmila

  • రాష్ట్ర విభజన రోజున పార్లమెంటులో మీ అన్న జగన్ ఉన్నారన్న దినకర్
  • సోనియాకు భయపడి కనీకనిపించనట్టు ప్లకార్డు పట్టుకున్నారని ఎద్దేవా
  • వైఎస్ మరణానికి సోనియానే కారణమని షర్మిల అన్నారని వ్యాఖ్య

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై బీజేపీ నేత లంకా దినకర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో మీ అన్న జగన్ అక్కడే ఉన్నారని... సోనియాగాంధీకి భయపడి దొంగచాటుగా ప్లకార్డులను కనీకనిపించకుండా పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఆనాడు పార్లమెంటులో మీ అన్న వ్యవహరించిన తీరు అందరికీ గుర్తుందని చెప్పారు. 

ఏపీకి జగన్ చేసిన అన్యాయాన్ని ఆనాడే షర్మిల విమర్శించి ఉంటే... ఈరోజు అందరూ ఆమెను నమ్మేవారని దినకర్ అన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్ట్ అయినప్పుడు దాన్ని షర్మిల స్వాగతించి ఉంటే ఆమెను అందరూ నమ్మేవారని చెప్పారు. ఆరోజు తన అన్నను పూర్తిగా సమర్థించిన షర్మిల... ఈరోజు విమర్శిస్తున్నట్టు కనిపిస్తున్నారని అన్నారు. 

తన తండ్రి వైఎస్సార్ మరణానికి సోనియాగాంధీనే కారణమని 2019కి ముందు ఏపీలో, 2023 వరకు తెలంగాణలో షర్మిల ఆరోపించారని... ఆ ఆరోపణలు నిజమో, కాదో ప్రజలకు తెలియజేయాలని దినకర్ డిమాండ్ చేశారు. ఏపీ బాధ్యతలు తీసుకున్న వెంటనే మణిపూర్ లో అల్లర్లు జరుగుతున్నాయని షర్మిల అంటున్నారని... ఈ నాలుగున్నరేళ్లలో వైసీపీ నేతల దౌర్జన్యాలకు బలైన దళితులు, అమరావతి రైతుల గురించి ఎందుకు మాట్లాడలేదో షర్మిల చెప్పాలని అన్నారు.

Lanka Dinakar
BJP
YS Sharmila
Congress
Sonia Gandhi
Jagan
YSRCP
AP Politics
  • Loading...

More Telugu News