Jai Hanuman: ప్రశాంత్ వర్మ ఆ పాత్రకి రిషభ్ శెట్టిని అనుకున్నాడట!

Prashanth  Varma Interview

  • 'హను మాన్'తో ప్రశాంత్ వర్మకి పెరిగిన క్రేజ్ 
  • ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉన్న దర్శకుడు 
  • సీక్వెల్ గా 'జై హనుమాన్' ఉంటుందని వెల్లడి 
  • హనుమంతుడి పాత్రధారి గురించే అందరిలో ఆసక్తి 

'హను మాన్' సినిమా సక్సెస్ తరువాత ఎక్కడ చూసినా దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరే వినిపిస్తోంది. ఈ సినిమా కథాకథనాలు .. అందుకు తగినట్టుగా ఆయన చేయించిన గ్రాఫిక్స్ సమపాళ్లలో ప్రేక్షకులను అలరించాయి. దాంతో సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, భారీ విజయాన్ని బహుమానంగా అందుకుంది.

వసూళ్ల పరంగా 200 కోట్ల రూపాయల వసూళ్లను అధిగమించిన ఈ సినిమా, అదే దూకుడు కొనసాగిస్తోంది. దాంతో ఇప్పటికీ ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలతో బిజీగానే ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " ఈ సినిమాలో విభీషణుడి పాత్రను సముద్రఖని పోషించారు. ఆ పాత్రకి ఆయన ఎంతో న్యాయం చేశారు" అన్నాడు. 

"అయితే విభీషణుడి పాత్రకిగాను ముందుగా నేను రిషభ్ శెట్టిని అనుకున్నాను. ఆయనను సంప్రదించాను కూడా. ఐతే అప్పుడు ఆయన 'కాంతార' సీక్వెల్ తో బిజీగా ఉన్నారు. అందువలన భవిష్యత్తులో నా ప్రాజెక్టులో తప్పకుండా చేస్తానని మాట ఇచ్చారు అని చెప్పాడు. నిజానికి 'హను మాన్' సీక్వెల్ గా రూపొందనున్న 'జై హనుమాన్'లో హనుమంతుడి పాత్రకి రిషభ్ శెట్టి సరిగ్గా సరిపోతాడు. మరి ఆ దిశగా ప్రశాంత్ వర్మ ఆలోచన చేస్తాడేమో చూడాలి.

More Telugu News