G. Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy writes letter to CM Revanth Reddy

  • భారత్ మాల, రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి లేఖ
  • భారత్ మాల కింద నిర్మించే రోడ్ల కోసం భూసేకరణ త్వరితగతిన చేపట్టాలని పేర్కొన్న కిషన్ రెడ్డి
  • ఆర్ఆర్ఆర్ కోసం ఎన్‌హెచ్ఏఐకి 50 శాతం నిధులు జమ చేయాలన్న కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. భారత్ మాల, రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి ఈ లేఖను రాశారు. భారత్ మాల కింద నిర్మించే రోడ్ల కోసం భూసేకరణ త్వరితగతిన చేపట్టాలని ఆ లేఖలో పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ కోసం ఎన్‌హెచ్ఏఐకి 50 శాతం నిధులు జమ చేయాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ స్పందించలేదని అందులో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చూడాలని పేర్కొన్నారు.

G. Kishan Reddy
Revanth Reddy
BJP
Congress
  • Loading...

More Telugu News