Jubilee Hills: బైక్ ను వెనక నుంచి ఢీ కొట్టిన కారు.. జూబ్లీహిల్స్ లో రోడ్డు ప్రమాదం

Road Accident In Jublee Hills Today

  • బుధవారం తెల్లవారుజామున యాక్సిడెంట్
  • అక్కడికక్కడే చనిపోయిన బౌన్సర్ తారక్ రాం.. మరో వ్యక్తికి గాయాలు
  • ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్.. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో అదుపుతప్పిన ఓ కారు ముందు వెళుతున్న బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా వెనక కూర్చున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా కారును ఆపకుండా డ్రైవర్ వేగంగా వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడంతో ఆ కారు ఎవరిది, ప్రమాదం చేసిన డ్రైవర్ ఎవరనే వివరాలు తెలియరాలేదు. కారు వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని తారక్ రాం గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. తారక్ రాం జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో బౌన్సర్ గా పనిచేస్తున్నాడని వివరించారు. మృతుడికి ఇటీవలే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని, తారక్ రాం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

Jubilee Hills
Road Accident
Biker Dead
Car Hit Bike
Hit and Run
Hyderabad
Bouncer Dead
  • Loading...

More Telugu News