Allu Arjun: నిర్మాత ఎస్కేఎన్ తండ్రికి నివాళులు అర్పించిన అల్లు అర్జున్

Allu Arjun visits producer SKN home

  • ఇటీవల నిర్మాత ఎస్కేఎన్ కు పితృవియోగం
  • కొన్నిరోజుల కిందట  కన్నుమూసిన గాదె సూర్యప్రకాశరావు
  • ఎస్కేఎన్ నివాసానికి వెళ్లిన అల్లు అర్జున్ 
  • ప్రపంచమే నాతో ఉన్నంత భరోసా కలుగుతోందన్న ఎస్కేఎన్

'బేబీ' చిత్ర నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్ నాయుడు) కు ఇటీవల పితృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఎస్కేఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశరావు కొన్నిరోజుల కిందటే కన్నుమూశారు. ఆయన దశదిన కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో, నిర్మాత ఎస్కేఎన్ ను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. 

హైదరాబాదులో ఎస్కేఎన్ నివాసానికి వచ్చిన అల్లు అర్జున్ అక్కడ గాదె సూర్యప్రకాశరావు చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్కేఎన్ తో కొద్దిసేపు మాట్లాడారు. అల్లు అర్జున్ రాకపై ఎస్కేఎన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

"నాకెంతో సన్నిహితుడైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ కష్ట సమయంలో మా ఇంటికి వచ్చి హృదయపూర్వక పరామర్శలు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా నాన్న మృతికి సంతాపం తెలిపేందుకు అల్లు అర్జున్ రావడంతో ప్రపంచమే నాతో ఉన్నంత భరోసా కలుగుతోంది. మీ ఆదరణకు, మద్దతుకు ధన్యవాదాలు" అంటూ ఎస్కేఎన్ పేర్కొన్నారు.

Allu Arjun
SKN
Father
Condolences
Tollywood
  • Loading...

More Telugu News