Somireddy Chandra Mohan Reddy: సీఎం జగన్ 'స్టార్ క్యాంపెయినర్' వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి కౌంటర్

Somireddy counters CM Jagan Star Campaigners remarks

  • చంద్రబాబుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్న జగన్
  • తనకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని వెల్లడి
  • జగన్ చెప్పింది 100 శాతం నిజం అంటూ సోమిరెడ్డి వ్యంగ్యం
  • 2024 ఎన్నికల్లో ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అంటూ ట్వీట్

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇతర పార్టీల్లోనూ, పొరుగు రాష్ట్రంలోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని, తనకు స్టార్ క్యాంపెనర్లు ఎవరూ లేరని, తనకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. 

"ఈ రోజు జగన్ చెప్పింది 100 శాతం నిజం. 2024 ఎన్నికలకు జనమే స్టార్ క్యాంపెయినర్లు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే ఎన్నికల యుద్దంలో సామాన్య ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు. జగన్ ను నమ్మి మోసపోయిన ప్రతి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినర్... దగా పడ్డ ప్రతి అన్నదాత ఒక స్టార్ క్యాంపెయినర్... ప్రభుత్వ బాదుడుతో బలైన ప్రతి పేదవాడు ఒక స్టార్ క్యాంపెయినర్... అణిచివేతకు గురైన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుడు కూడా వైసీపీని కూల్చే స్టార్ క్యాంపెయినరే" అంటూ సోమిరెడ్డి ట్వీట్ చేశారు.

Somireddy Chandra Mohan Reddy
Chandrababu
Jagan
Star Campaigner
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News