Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంపై పాకిస్థాన్ జెండాలతో ఫొటో మార్ఫింగ్ చేసిన వ్యక్తి అరెస్ట్

Police arrests Karnataka man after Ayodhya Ram Mandir photo morphed with Pakistan flags

  • అయోధ్యలో నిన్న చారిత్రాత్మక ఘట్టం
  • విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు 
  • వివాదాస్పద ఫొటో వైరల్
  • కర్ణాటకలో తాజుద్దీన్ అనే వ్యక్తి అరెస్ట్ 

యావత్ భారతావని మురిసేలా నిన్న (జనవరి 22) అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అయితే, అయోధ్య రామ మందిరంపై పాకిస్థాన్ జెండాలు పాతినట్టు ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. 

కర్ణాటకలోని గదగ్ జిల్లాకు చెందిన తాజుద్దీన్ దఫేదార్ (33) ఈ ఫొటో మార్ఫింగ్ కు పాల్పడినట్టు గుర్తించారు. అయితే, తాను ఈ ఫొటోను ఫేస్ బుక్ లో చూశానని, అనుకోకుండా ఇతరులకు షేర్ చేశానని తాజుద్దీన్ విచారణలో చెప్పాడు.

మత భావాలను రెచ్చగొట్టడం, జన సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి అభియోగాలతో అతడిపై ఐపీసీ 295ఏ, 153ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు తాజుద్దీన్ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి వివాదాస్పద ఫొటోను తొలగించారు.

  • Loading...

More Telugu News