Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కోమటిరెడ్డి సంచలన ప్రకటన

30 BRS MLAs Ready To Join In Congress After Lok Sabha Elections Says Komatireddy Venkat Reddy

  • విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు బయటపడతాయనే జగదీశ్‌రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారన్న మంత్రి
  • ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని పునరుద్ఘాటన
  • తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్నానని గుర్తు చేసిన వెంకట్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లొండ కలెక్టరేట్‌లో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్న తన గురించి మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్‌ కేంద్రాల్లో అక్రమాలతోపాటు చత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే ఆయన తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోపు అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు.

More Telugu News