YS Sharmila: కార్యరంగంలోకి ఏపీ కాంగ్రెస్ చీఫ్.. నేటి నుంచి షర్మిల జిల్లాల పర్యటన

AP Congress Chief YS Sharmila Dist Tour Begins From Today
  • ఈ నెల 31 వరకు జిల్లాల పర్యటన
  • నేడు శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో పర్యటన
  • పార్టీ పరిస్థితిపై వరుస సమీక్షలు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా నియమితురాలైన వైఎస్ షర్మిల కార్యక్షేత్రంలోకి దిగారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు 9 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. పార్టీ పరిస్థితిపై ఇచ్ఛాపురంలో నేతలతో సమీక్షిస్తారు. ఆ తర్వాత పార్వతీపురం చేరుకుని మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు మన్యం జిల్లాకు సంబంధించి సమీక్షిస్తారు. అనంతరం విజయనగరం చేరుకుని సాయంత్రం ఆరు నుంచి 7 వరకు జిల్లాపై సమీక్ష నిర్వహిస్తారు. 

రేపు విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు, ఎల్లుండి (25న) కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, 26న తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు. 27న గుంటూరు, పల్నాడు, 28న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, 30న శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, 31న నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు.
YS Sharmila
AP Congress
Srikakulam District
viziangaram
Visakhapatnam

More Telugu News