Naresh: పవిత్ర లోకేశ్ తో తన జీవితం ఎలా ఉందో తెలిపిన నరేశ్

My life with Pavitra Lokesh is very happy says Naresh

  • ఐదేళ్లుగా కలిసి జీవిస్తున్న పవిత్ర, నరేశ్
  • తనకు జరిగిన మూడు పెళ్లిళ్లతో తనకు సంతోషం లేదన్న నరేశ్
  • పవిత్రతో జీవితం సంతోషంగా ఉందని వ్యాఖ్య

సీనియర్ నటీనటులు నరేశ్, పవిత్ర లోకేశ్ ల ప్రేమాయణం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మూడో భార్యకు కూడా దూరమైన నరేశ్ పవిత్రకు దగ్గరయ్యారు. తన తొలి భర్తకు దూరమైన పవిత్రకు కూడా పిల్లలు ఉన్నారు. నరేశ్, పవిత్ర ఇద్దరూ దాదాపు ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. భర్తతో పవిత్ర విడాకులు తీసుకున్నారు. అయితే, నరేశ్ కు విడాకులు ఇవ్వడానికి ఆయన మూడో భార్య రమ్య రఘుపతి అంగీకరించడం లేదు. ఇద్దరి మధ్య కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. దీంతో, ఇప్పటి వరకు నరేశ్, లోకేశ్ పెళ్లి చేసుకోలేదు. అయినప్పటికీ ఇద్దరూ కలిసి ఉంటున్నారు. 

మరోవైపు, ఓ ఇంటర్వ్యూలో నరేశ్ మాట్లాడుతూ, పవిత్రతో తన జీవితం ఎలా ఉందో చెప్పారు. ప్రపంచంలో సగం మంది భార్యాభర్తలు విడిపోతున్నారని చెప్పారు. పెళ్లి వల్ల సమస్యలు ఎదుర్కొని 70 నుంచి 80 శాతం మంది మనశ్శాంతిగా లేరని అన్నారు. తనకు జరిగిన మూడు పెళ్లిళ్లతో తనకు సంతోషం కలగలేదని చెప్పారు. అందుకే పవిత్ర విషయంలో తాను ఒక నిర్ణయం తీసుకున్నానని... అది వివాదాస్పదమయిందని అన్నారు. పవిత్రతో తన జీవితం చాలా సంతోషంగా ఉందని నరేశ్ చెప్పారు. మిగిలిన జీవితాన్ని తాను, పవిత్ర ప్రశాంతంగా ముగించాలని అనుకుంటున్నామని తెలిపారు. 

More Telugu News