Pawan Kalyan: అయోధ్య నుంచి తిరిగొస్తూ ముఖేశ్ అంబానీతో పవన్ కల్యాణ్ మాటామంతీ

Pawan Kalyan interaction with Mukesh Ambani in Ayodhya

  • అయోధ్యలో నేడు చారిత్రాత్మక ఘట్టం
  • బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరైన పవన్
  • రిలయన్స్ అధినేతతో కాసేపు ముచ్చటించిన జనసేనాని

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ అయోధ్యలో జరిగిన రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ఆయన తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కాగా, అయోధ్య నుంచి పవన్ కల్యాణ్ తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య అధినేత ముఖేశ్ అంబానీని పవన్ కల్యాణ్ కలుసుకున్నారు. ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు. పవన్ తో ముఖేశ్ అంబానీ చిరునవ్వుతో మాట్లాడడం కనిపించింది. ఆ సమయంలో ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ కూడా అక్కడే ఉన్నారు.

Pawan Kalyan
Mukesh Ambani
Ayodhya Ram Mandir
Janasena
Reliance
Andhra Pradesh

More Telugu News