NT Rama Rao: 'గజదొంగ' కోసం రోజుకో పాటను షూట్ చేసిన రాఘవేంద్రరావు!

Kaikala Nageshwar Rao Interview

  • ఎన్టీఆర్ కెరియర్లో పెద్ద హిట్ 'గజదొంగ' 
  • దర్శకుడిగా వ్యవహరించిన రాఘవేంద్రరావు 
  • 5 రోజుల్లో 5 పాటలను షూట్ చేసిన వైనం 
  • మ్యూజికల్ హిట్ గా నిలిచిన సినిమా
  • చేతి గాయాన్ని ఎన్టీఆర్ లెక్కచేయలేదన్న నిర్మాత   


ఎన్టీ రామారావు కథానాయకుడిగా 1981లో వచ్చిన 'గజదొంగ' ఆయన కెరియర్లోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు నిర్మాత కైకాల సత్యనారాయణ తమ్ముడు కైకాల నాగేశ్వరరావు. తాజాగా 'మహా మ్యాక్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "రామారావుగారు ఏ నిర్మాతకైనా నెలకి 10 రోజుల చొప్పున 30 రోజులు డేట్స్ ఇచ్చేవారు. ఆ 30 రోజుల్లోనే ఆయనకి సంబంధించిన పోర్షన్ ను షూట్ చేయవలసి ఉంటుంది. అలాగే 'గజదొంగ' సినిమా కోసం కూడా మాకు డేట్స్ ఇచ్చారు. 

ఆ సినిమాలో ఇంకా 5 పాటలను చిత్రీకరించవలసి ఉందనగా, వేరే సినిమా షూటింగులో జరిగిన ప్రమాదం వలన, రామారావుగారికి చేయి విరిగింది. దాంతో ఆయన 6 వారాల పాటు విశ్రాంతి తీసుకుకోవాలని డాక్టర్లు చెప్పారు. అలా అయన 6 వారాల పాటు విశ్రాంతి తీసుకుంటే, హీరోయిన్స్ డేట్స్ మళ్లీ దొరకడం కష్టం. ఆ విషయం రామారావుగారికి కూడా తెలుసు. అందువల్లనే 4 వారాల విశ్రాంతి కాగానే ఆయన షూటింగు పెట్టుకోమన్నారు. 

రోజుకి ఒక పాట చిత్రీకరిస్తేనే అనుకున్న సమయానికి సినిమా పూర్తవుతుంది .. విడుదలకు వెళుతుంది. అదే విషయం రామారావుగారికి రాఘవేంద్రరావుగారు చెప్పారు. అందుకు ఆయన ఓకే అన్నారు. అలా సినిమాలోని 5 పాటలను ఐదు రోజుల్లో చిత్రీకరించడం జరిగింది. రోజుకో పాటను షూట్ చేశాము .. ఆ పాటలు ఎంత హిట్ అయ్యాయనేది అందరికీ తెలిసిందే. ప్రతి రోజు రామారావుగారు పొద్దుటే షూటింగుకి రావడం వలన అది సాధ్యమైంది" అని చెప్పారు.

More Telugu News