Sobhan Babu: అప్పట్లో శోభన్ బాబు దగ్గర పావలా కూడా ఉండేది కాదు: డబ్బింగ్ జానకి

Dubbing Janaki Special

  • 1100కి పైగా సినిమాలు చేసిన డబ్బింగ్ జానకి 
  • ఆర్ధిక ఇబ్బందులు పడ్డానని వెల్లడి 
  • జీవితంలో జాగ్రత్తపడ్డానంటూ వివరణ 
  • విజయకాంత్ మంచి మనసున్నవారని వ్యాఖ్య


డబ్బింగ్ జానకి .. అనగానే 'సాగర సంగమం'లో కమల్ తల్లి పాత్రనే గుర్తుకు వస్తుంది. సుదీర్ఘకాలంగా ఆమె కెరియర్ కొనసాగుతోంది. ఇంతవరకూ 1100 సినిమాలకి పైగా చేశారు. తాజాగా 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డబ్బింగ్ జానకి మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"అప్పట్లో నేను ఎన్టీఆర్ ... ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబులతో కలిసి నటించాను. శోభన్ బాబుగారితో కలిసి ఒక డ్రామా కోసం రిహార్సల్స్ కూడా చేశాను. ఆ సమయంలో లాగుడు రిక్షాలు ఉండేవి. ఆ లాగుడు రిక్షా వాళ్లు 'పావలా' తీసుకునేవారు. ఆ పావలా కూడా ఆయన దగ్గర ఉండేది కాదు. అంతగా ఆయన ఆర్ధిక ఇబ్బందులు చూశారు. కెరియర్ స్టార్టింగ్ కావడం వలన నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డాను" అని అన్నారు.

"నేను సంపాదించిన డబ్బు వృథా చేయలేదు. నా కుటుంబాన్ని గట్టెక్కించాను .. మరో నాలుగు కుటుంబాల వారికి సాయం చేశాను. రజనీ .. కమల్ .. విజయ్ కాంత్ తో కలిసి నటించాను. విజయకాంత్ గారికి తన సినిమా షూటింగు పూర్తి కాగానే, అందరికీ బట్టలు పెట్టడం అలవాటు. రాజకీయాల్లోకి రావడానికి ముందే ఆయన ఎంతోమందికి సాయం చేయడం నాకు తెలుసు" అంటూ చెప్పుకొచ్చారు. 

Sobhan Babu
Actor
Dubbing Janaki
Vijay Kanth
  • Loading...

More Telugu News