Sania Mirza: షోయబ్-సానియా అప్పుడే విడాకులు తీసుకున్నారట!

Divorced few months ago Sania Mirza family confirmed

  • పాక్ నటి సనా జావెద్‌ను పెళ్లాడిన షోయబ్ మాలిక్
  • షోయబ్ జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షించిన సానియా కుటుంబం
  • వారిద్దరూ కొన్ని నెలల క్రితమే విడిపోయినట్టు వివరణ
  • తమ గోపత్యకు భంగం కలిగించవద్దని అభిమానులకు విజ్ఞప్తి

సానియా మీర్జా నుంచి విడిపోయిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ పాక్ సినీ నటి సనా జావెద్ ను వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో విడాకుల వ్యవహారంపై సానియామీర్జా కుటుంబం స్పందించింది. పాకిస్థాన్ నటిని పెళ్లాడిన షోయబ్ జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తూ.. షోయబ్‌తో సానియా విడాకులు ఎప్పుడు తీసుకున్నదీ వెల్లడించింది. వారిద్దరూ కొన్ని నెలల క్రితమే విడిపోయినట్టు స్పష్టం చేసింది.

సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితంలో గోప్యత పాటించిందని, కానీ ఇప్పుడు ఓ విషయాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సానియామీర్జా (37), షోయబ్ కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నట్టు స్పష్టం చేసింది. షోయబ్ కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలని సానియా ఆకాంక్షించినట్టు తెలిపింది. తమ గోప్యతను గౌరవించి, ఊహాగానాలకు దూరంగా ఉండాలని అభిమానులను సానియా కుటుంబం అభ్యర్థించింది.

Sania Mirza
Shoaib Malik
Sania Mirza Family
Tennnis Star
Pak Cricketer
  • Loading...

More Telugu News