Fire Accident: చైనాలోని స్కూల్ వసతిగృహంలో అగ్నిప్రమాదం.. 13 మంది విద్యార్థుల సజీవ దహనం

13 charred to death as fire erupts in Chinas School

  • హెనాన్ ప్రావిన్సులోని యింగ్‌కై స్కూల్‌లో ఘటన
  • మరో విద్యార్థికి తీవ్ర గాయాలు
  • ప్రమాద కారణాలపై అధికారుల దర్యాప్తు

చైనాలోని హెనాన్ ప్రావిన్సులో విషాదం చోటుచేసుకుంది. ఓ స్కూల్ వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. యన్షాన్పు గ్రామంలోని యింగ్‌కై స్కూల్‌లో జరిగిందీ ఘటన. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్కూలుకు చేరుకుని మంటలు అదుపు చేశారు. మంటల్లో చిక్కుకున్న 13 మంది విద్యార్థులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్టు స్థానిక పత్రికలు తెలిపాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News