SA20: ఎస్ఏ20 మ్యాచ్ జరుగుతుండగా ఆనందం పట్టలేక గ్లాసు బీరు లాగించేసిన యువతి.. వైరల్ వీడియో ఇదిగో!

Girls Viral Beer Drinking Act In SA20

  • ఎస్ఏ20లో భాగంగా కేప్‌టౌన్‌లో ఎంఐ కేప్‌టౌన్-పార్ల్ రాయల్స్ మధ్య మ్యాచ్
  • 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఎంఐ కేప్‌టౌన్
  • యువతి బీరు తాగుతున్న వీడియోను షేర్ చేసిన ఎస్ఏ 20

ఎస్ఏ 20 లీగ్‌లో భాగంగా దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఎంఐ కేప్‌టౌన్-పార్ల్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అందరినీ ఆకర్షించే ఘటన ఒకటి జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎంఐ కేప్‌టౌన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత రాయల్స్‌ను 172/8కి కట్టడి చేసిన ఎంఐ అనంతరం 16.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి గెలుపొందింది. ర్యాన్ రికెల్టన్ 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 94 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

మైదానంలో మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న వేళ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న ఓ యువతి పక్కనే ఉన్న పెద్దాయన చేతిలోని బీరు గ్లాసును తీసుకుని ఆనందంతో ఒక్క దెబ్బతో గటగటా తాగేసింది. ఆమె అలా తాగుతూ ఉంటే పక్కనే ఉన్నవారు ఆమెను ప్రోత్సహించడం కూడా వీడియోలో కనిపిస్తోంది. అంతకుముందు కూడా ఆమె ఓ గ్లాస్ జ్యూస్‌ను లాగించేయడం వైరల్ అవుతున్న మరో వీడియోలో కనిపించింది. ఈ వీడియోను ఎస్ఏ20 తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. 

ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె టెక్నికల్‌గా డీహైడ్రేట్ అయిందని, దాని నుంచి బయటపడేందుకే బీర్ తాగినట్టు ఒకరు కామెంట్ చేస్తే.. ఆమె తాగిన దాంట్లో సగం ఆమె గెడ్డానికే అంటుకుందని, అయినప్పటికీ తనకంటే బాగానే తాగిందని మరొకరు కామెంట్ చేశారు.

SA20
MI Cape Town
Paarl Royals
Hydrate Responsibly
Viral Video

More Telugu News