Roja: అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత చంద్రబాబుకు లేదు: రోజా

Chandrababu has no right to touch Ambedkar statue
  • 100 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి, చంద్రబాబు మాట తప్పారన్న రోజా
  • అద్భుతమైన విగ్రహాన్ని జగన్ ఏర్పాటు చేశారని కితాబు
  • జగన్ కు వస్తున్న ప్రజాదరణను పచ్చ మీడియా ఓర్చుకోలేకపోతోందని మండిపాటు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా మరోసారి విరుచుకుపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా చంద్రబాబుకు లేదని ఆమె అన్నారు. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అన్న చంద్రబాబుకు నైతిక అర్హత లేదని చెప్పారు. 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని.. అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ ఏర్పాటు చేశారని రోజా కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను జగన్ కొనసాగిస్తున్నారని చెప్పారు. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సామాజిక న్యాయాన్ని జగన్ చేస్తున్నారని అన్నారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక పచ్చ మీడియా పిచ్చి రాతలు రాస్తోందని దుయ్యబట్టారు.
Roja
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Ambedkar

More Telugu News