Vijay Devarakonda: నేను కనిపిస్తే చాలు... పెళ్లి చేసేయాలని చూస్తున్నారు: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda reacts on rumors

  • రూమర్లపై స్పందించిన విజయ్ దేవరకొండ
  • మరోసారి విజయ్, రష్మికపై ఊహాగానాలు
  • ఫిబ్రవరిలో నిశ్చితార్థం, పెళ్లి జరగడంలేదని విజయ్ స్పష్టీకరణ

ప్రముఖ యువ హీరో విజయ్ దేవరకొండ తనపై వస్తున్న రూమర్లపై స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు ఎప్పుడూ తన చుట్టూ తిరుగుతుంటాయని, తాను కనిపిస్తే చాలు పెళ్లి చేసేయాలని చూస్తున్నాయని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇలాంటి రూమర్లు తనపై వస్తూనే ఉన్నాయని, ప్రతి రెండేళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎప్పట్లాగానే ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మికపై కొన్ని ఊహాగానాలు వచ్చాయి. వీటి గురించే విజయ్ దేవరకొండ పైవిధంగా స్పందించినట్టు తెలుస్తోంది. రూమర్లలో పేర్కొన్నట్టుగా ఫిబ్రవరిలో తనకు నిశ్చితార్థమేమీ జరగడంలేదని, పెళ్లి కూడా జరగడంలేదని వివరణ ఇచ్చారు.

Vijay Devarakonda
Rashmika Mandanna
Rumors
Tollywood
  • Loading...

More Telugu News