Yarlagadda Lakshmi Prasad: బాలకృష్ణ కూతురుతో లోకేశ్ పెళ్లి చేస్తారా? అని అడిగితే.. చంద్రబాబు నాన్సెన్స్ అన్నారు: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

Chandrababu said nonsense when I asked about Nara Lokesh marriage with Blakrishna daughter says Yarlagadda Lakshmi Prasad

  • మేనరికాలు మంచివి కావని చంద్రబాబు చెప్పేవారన్న యార్లగడ్డ
  • చివరకు బాలయ్య కూతురుతోనే లోకేశ్ కు పెళ్లి చేశారని వ్యాఖ్య
  • జగన్ అంటే తనకు వ్యక్తిగతంగా ఇష్టమన్న యార్లగడ్డ

టీడీపీ యువనేత నారా లోకేశ్ పెళ్లికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. మేనరికం వివాహాలు మంచివి కాదని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పేవారని తెలిపారు. బాలకృష్ణ కూతురుని లోకేశ్ కి ఇచ్చి పెళ్లి చేస్తారా? అని గతంలో చంద్రబాబును తాను అడిగానని... దీంతో, నాన్సెన్స్ అంటూ తనను తిట్టారని చెప్పారు. మేనరికపు సంబంధాలు మంచివి కాదని చెప్పారని... అయితే, ఆ తర్వాత లోకేశ్ కు బాలయ్య కూతురుతోనే పెళ్లి చేశారని తెలిపారు. 

అంబేద్కర్ ఒక మహోన్నత వ్యక్తి అని... దేశానికి ఆయన ఒక ఐకాన్ అని యార్లగడ్డ కొనియాడారు. ఆయన విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తుండటం సంతోషకర విషయమని చెప్పారు. నేను మంచి చేస్తేనే మళ్లీ ఓటు వేయండని ధైర్యంగా చెప్పిన నాయకుడు జగన్ అని ప్రశంసించారు. వ్యక్తిగతంగా జగన్ అంటే తనకు ఇష్టమని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినంత మాత్రాన ఆయనకొచ్చే నష్టం ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

More Telugu News