Sania Mirza: అసలేం జరుగుతోంది... సానియా మీర్జా పోస్టులో విడాకుల మాట!

Sania Mirza post goes viral

  • పాక్ క్రికెటర్ ను పెళ్లాడిన సానియా మీర్జా
  • కొంతకాలంగా సానియా వైవాహిక జీవితంపై వార్తలు
  • విడాకులపై తరచుగా కథనాలు
  • తాజా పోస్టుతో మరోసారి చర్చనీయాంశంగా మారిన వైనం

భారత టెన్నిస్ రారాణి సానియా మీర్జా వ్యక్తిగత జీవితం గత కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా మారింది. సానియా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. సానియా, షోయబ్ దంపతులకు ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు. 

అయితే, సానియా విడాకులు తీసుకుంటోంది అనే అంశం ఇటీవల తరచుగా తెరపైకి వస్తోంది. సానియా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తే... ఆమె నిజంగానే విడాకుల గురించి ఆలోచిస్తోందేమో అనే సందేహాం వచ్చేలా ఉంటాయి. ఆ తర్వాత సానియా తన భర్త షోయబ్ మాలిక్ తో కలిసి ఓ టీవీ షో చేసేసరికి అన్ని అనుమానాలు తాత్కాలికంగా పటాపంచలు అయ్యాయి. 

ఇప్పుడు మరోసారి విడాకుల ప్రస్తావన తీసుకువస్తూ సానియా పెట్టిన పోస్టుతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇంతకీ సానియా పోస్టులో ఏముందంటే... "పెళ్లి అనేది కఠినమైనది, విడాకులు తీసుకోవడం కూడా కఠినమైన అంశమే. ఇందులో నీకు నచ్చిన కఠినమైన అంశాన్ని ఎన్నుకో. స్థూలకాయం కష్టం, ఫిట్ గా ఉండడం కష్టం... నీకు నచ్చిన కష్టాన్ని ఎంచుకో. అప్పులు చేయడం కష్టం, ఆర్థిక క్రమశిక్షణతో నడుచుకోవడం కష్టం. నీకు నచ్చిన కష్టాన్ని ఎంచుకో. భావవ్యక్తీకరణ కష్టం... భావాలను వ్యక్తీకరించకపోవడం కష్టం... నీకు నచ్చిన కష్టాన్ని ఎంచుకో. జీవితం ఎల్లప్పుడూ పూలపాన్పులా ఉండదు, అది కఠినంగా కూడా ఉంటుంది. కానీ మనకు నచ్చిన కష్టాన్ని ఎంచుకునే వెసులుబాటు మనకు ఉంటుంది... అయితే ఆ కష్టాన్ని తెలివిగా ఎంచుకోవాల్సి ఉంటుంది" అంటూ సానియా పేర్కొంది.

Sania Mirza
Divorce
Social Media
Tennis
Shoaib Malik
India
Pakistan
  • Loading...

More Telugu News