Venigandla Ramu: కొడాలి నానీ... ఇక సహనం చచ్చిపోయింది... నీ ఆటలు సాగనివ్వం: వెనిగండ్ల రాము

Venigandla Ramu fires on Kodali Nani

  • గుడివాడలో చంద్రబాబు రా... కదలిరా సభ
  • హాజరైన గుడివాడ టీడీపీ ఇన్చార్జి వెనిగండ్ల రాము
  • రోడ్లు వేయించలేని అసమర్థుడు కొడాలి నాని అంటూ ధ్వజం
  • నాని ఇప్పటికే దుకాణం సర్దేశాడని ఎద్దేవా

గుడివాడ ‘రా... కదలిరా’ బహిరంగసభలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వెనిగండ్ల రాము వాడీవేడిగా ప్రసంగించారు. ముఖ్యంగా సిట్టింగ్ వైసీసీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానీపై ధ్వజమెత్తారు. కొడాలి నానీ... ఇక సహనం చచ్చిపోయింది... నీ ఆటలు సాగనివ్వం అని హెచ్చరించారు. 

గుడివాడ నియోజకవర్గంలో రోడ్లు వేయించలేని అసమర్థుడు నానీ అంటూ విమర్శించారు. రోడ్లపై కార్లు ఉన్నవాళ్లు మాత్రమే తిరుగుతారు అంటూ పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడు అని వెనిగండ్ల రాము మండిపడ్డారు. చంద్రబాబు తెలివితేటలు, దూరదృష్టి పూర్తిగా ఉపయోగించుకుంటే రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయని అన్నారు. P-4 కార్యక్రమంతో పేదల జీవితాలు మార్చడానికి చంద్రబాబు కొత్త ఆలోచనలు చేస్తున్నారని వివరించారు. చంద్రబాబుకి పవన్ కల్యాణ్ తోడైతే... ఆపడం ఎవరికైనా సాధ్యమవుతుందా? అని వెనిగండ్ల రాము సమరోత్సాహం ప్రదర్శించారు. 

"గుడివాడలో ఇప్పటికే మనం తొక్కుకుంటూ ముందుకు పోతున్నాం. నాని ఇప్పటికే దుకాణం సర్దేశాడు. తెలుగుదేశం పార్టీ సభకు 5 వేలకు మించి రారన్నాడు... వస్తే తట్టాబుట్టా సర్దుకుంటానని నాని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడున్న జనాన్ని చూశాక నానీకి సౌండ్ లేదు. మనందరం నానీ తట్టాబుట్టా సర్ది అతన్ని సాగనంపుదాం" అంటూ వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు.

Venigandla Ramu
Kodali Nani
Gudivada
Raa Kadali Raa
Chandrababu
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News