Varla Ramaiah: నీకు సిగ్గు లేకపోతే నీ నాయకుడికైనా ఉండాలి కదా?: కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్

Varla Ramaiah fires on Kodali Nani

  • ఎన్టీఆర్ వర్ధంతిని కొడాలి నాని నిర్వహించడంపై వర్ల రామయ్య మండిపాటు
  • వైసీపీ వాళ్లు ఎన్టీఆర్ అభిమానులా? అని ప్రశ్న
  • విధ్వంసం, అరాచకమే వైసీపీ విధానమని మండిపాటు

గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. తమకు పోటీగా ఎన్టీఆర్ కార్యక్రమం చేయడానికి కొడాలి నానికి సిగ్గు, శరం ఉన్నాయా? అని ప్రశ్నించారు. నీకు సిగ్గు లేకపోతే నీ నాయకుడికైనా ఉండాలి కదా? అని అన్నారు. 

వైసీపీ వాళ్లు ఎన్టీఆర్ అభిమానులా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. తాము వైఎస్సార్ వర్ధంతిని చేస్తామా? అని అడిగారు. ఎన్టీఆర్ వర్ధంతిని వైసీపీ వాళ్లు చేస్తుంటే... జగన్ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యక్రమానికి వైసీపీ వాళ్లకు పోలీసులు ఎలా అనుమతిని ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం మారడానికి మరో 84 రోజులు మాత్రమే ఉందనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని అన్నారు. వైసీపీ నేతలకు చుట్టాలుగా పోలీసులు పని చేయరాదని చెప్పారు. 

ఎన్టీఆర్ కు గుడివాడ ఎంతో ఇష్టమైన ఊరు అని... అందుకే ఇక్కడ 'రా.. కదలిరా' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వర్ల అన్నారు. ఈ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. విధ్వంసం, అరాచకమే వైసీపీ విధానమని విమర్శించారు.

Varla Ramaiah
NTR
Telugudesam
Kodali Nani
Jagan
YSRCP
  • Loading...

More Telugu News