Sandeep Kishan: ఉత్కంఠను పెంచుతున్న 'ఊరుపేరు భైరవకోన' ట్రైలర్!

Ooru Peru Bhairavakona Trailer Release

  • సందీప్ కిషన్ హీరోగా 'ఊరుపేరు భైరవకోన'
  • వీఐ ఆనంద్ నుంచి మరో ప్రయోగం 
  • అడుగడుగునా ఆసక్తిని రేపుతున్న ట్రైలర్
  • ఫిబ్రవరి 9వ తేదీన విడుదల 
  • కథానాయికలుగా కావ్య థాపర్ - వర్ష బొల్లమ్మ


మొదటి నుంచి కూడా సందీప్ కిషన్ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఎప్పటికప్పుడు తెరపై కొత్తగా కనిపించడానికీ .. కొత్త కథలను పరిచయం చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాడు. అలాంటి సందీప్ కిషన్ తాజా చిత్రంగా 'ఊరుపేరు భైరవకోన' రూపొందింది. వీఐ ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు. 

వీఐ ఆనంద్ సినిమాలను ఒకసారి పరిశీలిస్తే, ఆయన రెడీ చేసుకునే కంటెంట్ రొటీన్ కి భిన్నంగా ఉంటుంది. 'ఊరు పేరు భైరవకోన' విషయంలోను అదే పద్ధతి మనకి కనిపిస్తుంది. అతీంద్రియ శక్తులు సృష్టించే అవరోధాలు .. వాటిని దాటుకుంటూ వెళ్లి, తనకి కావలసిన దానిని హీరో దక్కించుకోవడమే ప్రధానాంశంగా ఈ కథ నిర్మితమైంది. 

 అలాంటి ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక వైపున దైవశక్తి .. మరో వైపున క్షుద్రశక్తి .. ఇంకో వైపున కర్మ సిద్ధాంతం .. ఈ మూడింటిని కలుపుకుని ఈ సినిమా నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. కావ్య థాపర్ - వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను, దాదాపు చీకట్లోనే చిత్రీకరించడం విశేషం.

More Telugu News