YS Jagan: మేనల్లుడి నిశ్చితార్థం కోసం హైదరాబాద్ వెళుతున్న సీఎం జగన్

CM Jagan will attend Rajareddy engagment tomorrow

  • జనవరి 18న షర్మిల తనయుడి నిశ్చితార్థం
  • హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్ లో వేడుక
  • రేపు సాయంత్రం హైదరాబాద్ పయనం

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో రేపు (జనవరి 18) హైదరాబాద్ లో జరగనుంది. ఇటీవల షర్మిల తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సీఎం జగన్ రేపు హైదరాబాద్ వెళ్లనున్నారు. 

గురువారం సాయంత్రం 6.45 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరనున్నారు. రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ కు వెళ్లి... తన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొంటారు. అనంతరం, రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి తాడేపల్లి బయల్దేరనున్నారు. 

కాగా, ఆ మరుసటి రోజు (జనవరి 19) విజయవాడలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు.

More Telugu News