Singer Chitra: ప్రముఖ గాయని చిత్రపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్

Heavy trolling on singer Chitra

  • జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం
  • ప్రతి ఒక్కరూ శ్రీరామ కీర్తనలు ఆలపించాలన్న చిత్ర
  • ఇళ్లలో 5 ప్రమిదలు వెలగించాలని వీడియో సందేశం
  • సోషల్ మీడియాలో చిత్రపై విరుచుకుపడుతున్న ఓ వర్గం వారు

ప్రముఖ సినీ నేపథ్య గాయని చిత్ర అనూహ్య రీతిలో భారీగా ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఇంతకీ చిత్ర ఏంచేశారంటే... జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా, ఆ రోజున ప్రతి ఒక్కరూ శ్రీరామ కీర్తనలు ఆలపించాలని, తమ ఇళ్లలో 5 ప్రమిదలు వెలిగించాలంటూ చిత్ర ఓ వీడియో సందేశం వెలువరించారు. 

చిత్ర విడుదల చేసిన ఆ వీడియో వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వర్గం వారు చిత్రను లక్ష్యంగా చేసుకుని, ఆమెకు రాజకీయాలు ఆపాదిస్తూ విరుచుకుపడుతున్నారు. గత రెండ్రోజులుగా చిత్రపై ట్రోలింగ్ కొనసాగుతూనే ఉంది. 

అయితే చిత్రకు కేరళ అధికార పక్షం సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ మద్దతుగా నిలిచాయి. సినీ గాయకులు, రచయితలు కూడా చిత్రకు సంఘీభావం ప్రకటించారు.

Singer Chitra
Trolling
Ayodhya Ram Mandir
Social Media
  • Loading...

More Telugu News