Teja Sajja: హను మాన్ హీరో నుంచి 'మిరాయ్' .. బడ్జెట్ 40 కోట్లు!

Teja Sajja Special

  • 'హను మాన్'తో హిట్ కొట్టిన తేజ సజ్జా 
  • నెక్స్ట్ మూవీ 'మిరాయ్'పై అంచనాలు
  • కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న మూవీ 
  • ప్రత్యేక పాత్రల్లో దుల్కర్ - మంచు మనోజ్


సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పాటు దిగిన 'హను మాన్' వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది. చాలా తక్కువ సమయంలోనే తేజ సజ్జా 100 కోట్ల హీరో అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో చాలామంది ఆయన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. ఆయన నెక్స్ట్ మూవీగా 'మిరాయ్' రూపొందుతోంది. 'మిరాయ్' అంటే ఆయుధం అనే అర్థం చెబుతున్నారు. 

'హను మాన్' సినిమాను పాతిక కోట్లలోనే పూర్తి చేశారు.'మిరాయ్' సినిమా బడ్జెట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని అనుకుంటే పొరపాటే. 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి ఈ సినిమా రానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుందని అంటున్నారు. 

ఇది యాక్షన్ అడ్వెంచర్ జోనర్లో కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమా మరో ప్రత్యేకతను సంతరించుకుంది. అదేమిటంటే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ - మంచు మనోజ్ ప్రత్యేకమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే, నక్కిన త్రినాథరావుతో కలిసి తేజ సజ్జా సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు.

Teja Sajja
Karthik Ghatttamaneni
Mirai Movie
Trinatha Rao
  • Loading...

More Telugu News