Ponnam Prabhakar: రేపు ఆటో కార్మికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం

Minister Ponnam Prabhakar meeting with auto drivers
  • తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్ల ఆందోళన 
  • తమకు భృతి చెల్లించాలని ఆటో డ్రైవర్ల డిమాండ్
  • రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఆటో కార్మిక సంఘాలతో సమావేశం
మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు ఆటో కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయనే విమర్శలు వచ్చాయి. పలుచోట్ల ఆటో డ్రైవర్లు ఆందోళన తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమకు నష్టం జరిగిందని... తమకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రేపు ఆటో కార్మికులతో సమావేశం కావాలని నిర్ణయించారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 14 ఆటో యూనియన్ సంఘాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి.
Ponnam Prabhakar
Telangana
Congress

More Telugu News