Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 1,628 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

markets ends in losses

  • అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు
  • అమ్మకాల ఒత్తిడికి గురైన బ్లూచిప్ కంపెనీల షేర్లు
  • 460 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు, బ్లూచిప్ కంపెనీల షేర్లలో అమ్మకాలు మార్కెట్లను కుప్పకూల్చాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,628 పాయింట్లు నష్టపోయి 71,500కి పడిపోయింది. నిఫ్టీ 460 పాయింట్లు కోల్పోయి 21,571కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.34%), టీసీఎస్ (0.60%), ఇన్ఫోసిస్ (0.55%), టెక్ మహీంద్రా (0.54%), నెస్లే ఇండియా (0.08%). 

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-8.46%), టాటా స్టీల్ (-4.08%), కోటక్ బ్యాంక్ (-3.66%), యాక్సిస్ బ్యాంక్ (-3.18%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.85%).

  • Loading...

More Telugu News