Vishwambhara: మెగాస్టార్ అనే ఇమేజ్ ను దాటి పైకి వెళ్లడానికి అక్కడ ఏమీ లేదు: 'విశ్వంభర' డైరెక్టర్ వశిష్ఠ

Sri Vashishta Interview

  • చిరంజీవి తాజా చిత్రంగా 'విశ్వంభర'
  • 20 శాతం చిత్రీకరణ  పూర్తయిందన్న వశిష్ఠ 
  • మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉంటుందని వెల్లడి 
  • వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఉంటుందని స్పష్టీకరణ


శ్రీ వశిష్ఠ పేరు వినగానే ఆయన దర్శకత్వం వహించిన 'బింబిసార' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ తరువాత సినిమాను ఆయన చిరంజీవి కథానాయకుడిగా 'విశ్వంభర' రూపొందిస్తున్నారు. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "చిరంజీవిగారితో సినిమా మొదలైంది. యాక్షన్ సీన్స్ తో షూటింగు మొదలుపెట్టాము .. 20 శాతం షూటింగు పూర్తయింది" అని చెప్పారు. 

'విశ్వంభర'లో చిరంజీవిని ఆయన ఇమేజ్ కి తగినట్టుగా చూపిస్తే చాలు .. ఎందుకంటే మెగాస్టార్ అనే ఇమేజ్ ను దాటి పైకి వెళ్లడానికి అక్కడ ఏమీ లేదు. ఆయన పేరును చెడగొట్టకుండా చేస్తే చాలనే అనుకుంటున్నాను. ఈ ఫాంటసీ సినిమాను నా స్కూల్ లోనే డిజైన్ చేసుకున్నాను. ఇది కాస్ట్యూమ్ డ్రామా కాదు, లవ్ .. రొమాన్స్ కూడా ఉంటాయి. కాకపోతే అక్కడి వరకూ రావడానికి ఇంకా సమయం వుంది'' అన్నారు. 

నేను నా స్టైల్ లోనే నా వర్క్ ను చేస్తూ వెళతాను. ఒకవేళ నాపై ఎవరి ప్రభావమైనా ఉందనుకుంటే అది వినాయక్ గారేనని చెప్పుకోవచ్చు. కథ చెప్పడం ఎలా అనేది నేను ఆయనను చూసే నేర్చుకున్నాను. ఆయనతో కలిసి చాలా దూరం ప్రయాణం చేశాను. అందువలన ఆయన మార్క్ నా టేకింగ్ లో కనిపించవచ్చు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాము" అని చెప్పారు.

Vishwambhara
Chiranjeevi
Sri Vashishta
  • Loading...

More Telugu News