Jr SVR Interview: ఎస్వీఆర్ .. ఎన్టీఆర్ మధ్య మనస్పర్థలు వచ్చిన మాట వాస్తవమే: ఎస్వీఆర్ మనవడు

JR SVR Interview

  • 'పాండవ వనవాసం' సినిమా షూటింగులో స్క్రిప్ట్ పరంగా వివాదం వచ్చిందన్న ఎస్వీఆర్ మనవడు  
  • దాంతో తాతగారు నాలుగేళ్లపాటు తెలుగు సినిమాలు చేయలేదని వెల్లడి   
  • బీఎన్ రెడ్డిగారు వాళ్లు నచ్చజెప్పడం వలన మళ్లీ ఇద్దరూ కలిసి నటించారని వివరణ   


తెలుగు తెరపై తిరుగులేని నటుడిగా కొనసాగిన ఎస్వీఆర్ ను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి ఎస్వీఆర్ గురించి ఆయన మనవడు జూనియర్ ఎస్వీఆర్ తాజాగా 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. "మా తాతగారి పేరుతో మేము ఎలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయలేదని చాలామంది అంటున్నారు. కానీ మేము చేయవలసింది చేస్తున్నాము .. కాకపోతే బయటికి చెప్పుకోవడం లేదు. ఆయన అభిమానులు ఎలాంటి ఫంక్షన్ ఏర్పాటు చేసినా వెళుతూనే ఉన్నాము" అని అన్నారు.

" ఇండస్ట్రీ నుంచి మాకు ఎలాంటి ఇన్విటేషన్స్ ఉండటం లేదు. మేము ఎక్కడ ఉంటున్నది తెలియడం లేదని అంటున్నారు. నిజానికీ నేను .. మా అన్నయ్య .. మా మావయ్య అందరూ కూడా ఇండస్ట్రీలోనే .. హైదరాబాదులోనే ఉంటున్నాము .. ఈ విషయం చాలామందికి తెలుసు కూడా. అప్పట్లో మా తాతగారికి .. ఎన్టీఆర్ గారికి కొంతకాలం పాటు గ్యాప్ వచ్చిందని నేను కూడా విన్నాను. 

'పాండవ వనవాసం' సినిమా షూటింగులో స్క్రిప్ట్ లో లేని డైలాగ్ ను తాతగారు చెప్పడం వల్లనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అనుకుంటూ ఉండేవారు. ఆ గొడవ కారణంగా తాతగారు నాలుగేళ్లపాటు తెలుగు సినిమాలు చేయలేదు. ఆ సమయంలో ఆయన తమిళ .. మలయాళ సినిమాలు చేస్తూ వెళ్లారు. ఆ తరువాత బీ ఎన్ రెడ్డిగారు వాళ్లు నచ్చజెప్పడం వలన మళ్లీ ఇద్దరూ కలిసి నటించారు" అని చెప్పారు జూనియర్ ఎస్వీఆర్.

Jr SVR Interview
Actor
Tollywood
NTR
  • Loading...

More Telugu News