Federal Housing Scheme: కేంద్రం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఫెడరల్ హౌసింగ్ స్కీం కొనసాగింపు!
- మోదీ మానసపుత్రిక ‘అందరికీ ఇళ్లు’ పథకానికి కేటాయింపుల పెంపు
- గత బడ్జెట్‌లో 790 బిలియన్ రూపాయల కేటాయింపు
- 2024-25 బడ్జెట్‌లో ట్రిలియన్ రూపాయలకు పెంపు
- అందుబాటులో ఉన్న సబ్సిడీల కొనసాగింపు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానసపుత్రిక పథకమైన ఫెడరల్ హౌసింగ్ స్కీంను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దీనిని పొడిగించడంతోపాటు లోకాస్ట్ హౌసింగ్ లోన్స్ (తక్కువ ధర గృహ రుణాలు)కు అందుబాటులో ఉన్న సబ్సిడీలను పెంచాలని భావిస్తోంది. సార్వత్రికలకు ముందు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో తక్కువ ధర గృహాలకు కేటాయింపులను 15 శాతానికిపైగా పెంచి ట్రిలియన్ రూపాయలకు పెంచనున్నట్టు దీనితో సంబంధం ఉన్న ముుగ్గురు విశ్వసనీయ వ్యక్తుల ద్వారా తెలిసింది. 2023-24లో ఈ కేటాయింపులు 790 బిలియన్ రూపాయలుగా ఉండగా ఈ బడ్జెట్‌లో అవి ట్రిలియన్ రూపాయలకు చేరుకోనున్నాయి.
140 కోట్లకుపైగా జనాభా ఉన్న భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల గృహాలు, పట్టణ ప్రాంతాల్లో 15 లక్షల గృహాలకుపైగా తక్కువగా ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2030 నాటికి ఈ సంఖ్య రెండింతలు అవుతుందని అంచనా. ఈ ఏడాది మే చివర్లో ఎన్నికలు ఎదుర్కోబోతున్న ప్రధాని మోదీ.. 2015లో ‘అందరికీ ఇళ్లు’ పథకాన్ని ప్రారంభించారు.