Devineni Uma: వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిని తరిమికొట్టాలి: దేవినేని ఉమా

Devineni Uma fires on Kodali Nani

  • కొడాలి నాని బూతుల ఎమ్మెల్యే అన్న దేవినేని ఉమా
  • పోలవరం, పట్టిసీమ అంటే ఏమిటో కూడా తెలియదని ఎద్దేవా
  • టిడ్కో ఇళ్ల కాలనీకి రాజశేఖరెడ్డి పేరు పెట్టారని విమర్శ

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బూతుల ఎమ్మెల్యేకి పోలవరం అంటే ఏమిటో తెలియదని, పట్టిసీమ అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. టిడ్కో ఇళ్లను చంద్రబాబు కట్టిస్తే... ఆ కాలనీకి రాజశేఖరరెడ్డి పేరు పెట్టిన వ్యక్తి కొడాలి నాని అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో నానిని తరిమి కొట్టాలని అన్నారు. రేపు మల్లాయపాలెంలో 'రా.. కదలిరా' బహిరంగసభ జరగనుంది. ఈ సభ ఏర్పాట్లను బూరగడ్డ వేదవ్యాస్ తో కలిసి దేవినేని ఉమా పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. ప్రజాస్వామ్యంపై నానికి నమ్మకం లేదని విమర్శించారు.

Devineni Uma
Telugudesam
Kodali Nani
YSRCP
Andhra Pradesh
AP Politics
  • Loading...

More Telugu News