Udaya Bhanu: బుల్లితెరకు.. మళ్లీ వస్తున్న ఉదయభాను!

Zee Telugu Released Golden Lady Udaya Bhanu Promo

  • ఒకప్పుడు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందిన ఉదయభాను
  • పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితానికే పరిమితం
  • జీ తెలుగు ‘సూపర్ జోడీ’ డ్యాన్స్ షోతో తిరిగి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు
  • ప్రోమో రిలీజ్ చేసిన జీ తెలుగు
  • జడ్జీలుగా మీనా, శ్రీదేవి విజయ్‌కుమార్, రఘు మాస్టర్

ఉదయభాను.. నిన్నటి తరం బుల్లితెర ప్రేక్షకులకు బా‌గా తెలిసిన పేరిది. ఒకప్పుడు యాంకరింగ్‌కు పర్యాయపదంగా మారిన ఉదయభాను ఆ తర్వాత పెళ్లి చేసుకుని టీవీ ప్రేక్షకులకు దూరమయ్యారు. ఇన్నేళ్లకు మళ్లీ అభిమానులను పలకరించేందుకు ఇంటింటికీ వస్తున్నారు. జీ తెలుగులో ప్రసారం కానున్న ‘సూపర్ జోడీ’ అనే డ్యాన్స్ ప్రోగ్రాంకు ఆమె హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను జీతెలుగు విడుదల చేసింది. 

ఈ నెల 28 నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభం అవుతుందని, గోల్డెన్ లేడీ ఉదయభాను ప్రోమో అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియోలో ఉదయభాను తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ.. ‘ఆపొద్దు అమ్మా’ అని తన పిల్లలు చెప్పడంతో సూపర్ జోడీ ప్రోగ్రాంతో యాంకర్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నట్టు వెల్లడించారు.
 
సూపర్ జోడీ ప్రోగ్రాంకు సీనియర్ నటి మీనా జడ్జిగా వ్యవహరిస్తున్నట్టు చెబుతూ మరో వీడియోను కూడా జీ తెలుగు విడుదల చేసింది. సోమవారం నుంచి శనివారం వరకు ఇంట్లో పనితోనే సరిపోతుందని, సండే కూడా ఫన్ లేదంటూ ఆ వీడియోలో మీనా విచారం వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంగా సూపర్ జోడీ డ్యాన్స్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్టు, అందులో 8 సెలబ్రిటీ జోడీలు ఉంటాయన్న విషయాన్ని రివీల్ చేసింది. ఈ షోకు మీనాతోపాటు కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, మరో సీనియర్ నటి శ్రీదేవి విజయ్ కుమార్ కూడా జడ్జీలుగా వ్యవహరించనున్నారు. ఈ షో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతుంది. 

More Telugu News