Cheetah: నమీబియా నుంచి తీసుకువచ్చిన మరో చిరుత మృతి

Another Cheetah dies in Kuno National Park

  • భారత్ లో చాన్నాళ్ల క్రితమే అంతరించిన చీతాలు
  • నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి భారత్ కు చీతాలు
  • కునో నేషనల్ పార్క్ లో ఇప్పటివరకు 10 చీతాల మృతి

భారత్ లో చీతాల జనాభా అంతరించిపోయిందన్న కారణంతో ఆఫ్రికా దేశాల నుంచి చీతాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి కొన్ని చీతాలను తీసుకువచ్చి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వదిలారు. కానీ అవి అనూహ్యరీతిలో వరుసగా మృత్యువాత పడుతున్నాయి. 

తాజాగా, శౌర్య అనే చీతా కూడా మృతి చెందింది. దాంతో, ఇప్పటివరకు ఈ అభయారణ్యంలో మరణించిన చీతాల సంఖ్య 10కి పెరిగింది. కాగా, శౌర్య అనే ఈ చీతా ఉదయం నుంచి అనారోగ్య లక్షణాలతో ఉన్నట్టు గుర్తించారు. ఆ చీతా నడక అస్థిరంగా ఉన్నట్టు గుర్తించిన కునో నేషనల్ పార్క్ వైద్యబృందం చికిత్స అందించేందుకు ప్రయత్నించింది. కానీ, శౌర్య కోలుకోలేకపోయింది. పోస్టుమార్టం పూర్తయితే ఆ చీతా మృతికి గల కారణం తెలుస్తుంది.  

ప్రస్తుతానికి కునో నేషనల్ పార్క్ లో 13 పెద్ద చీతాలు, నాలుగు కూనలు ఉన్నాయని, వాటి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు వెల్లడించారు.

More Telugu News