GVL Narasimha Rao: రిక్షా కార్మికుడిని కూర్చోబెట్టుకుని, రిక్షా తొక్కిన బీజేపీ ఎంపీ జీవీఎల్

GVL pulls rikshaw in Vizag

  • విశాఖలో మహా సంక్రాంతి సంబరాలు
  • నేడు ముగింపు రోజు
  • ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ జీవీఎల్

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో మహా సంక్రాంతి సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ మహా సంక్రాంతి సంబరాలకు నేడు ముగింపు రోజు. ఈ సందర్భంగా జీవీఎల్ ఓ రిక్షా కార్మికుడిని కూర్చోబెట్టుకుని రిక్షా తొక్కారు. సంప్రదాయ పంచెకట్టులో ఉన్న జీవీఎల్... నడుముకు కండువా బిగించి రిక్షా తొక్కారు. అనంతరం ఆ రిక్షా కార్మికుడికి డబ్బులు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను జీవీఎల్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పంచుకున్నారు. 

"విశాఖలో మహా సంక్రాంతి సంబరాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో రిక్షా కార్మికుడు పెంటయ్యను అతని రిక్షాలోనే ఎక్కించుకుని తొక్కాను. తన రిక్షా తొక్కే అవకాశం నాకు ఇచ్చినందుకు అతనికి రుసుం చెల్లించాను" అని జీవీఎల్ వివరించారు.

GVL Narasimha Rao
Rikshaw
Maha Sankranti Sambaralu
Visakhapatnam
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News