Hanu Man: 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన 'హను మాన్'

Hanu Man Movie Update

  • సంక్రాంతి బరిలో నిలిచిన 'హను మాన్'
  • ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమా 
  • 4 రోజులలో రాబట్టిన 100 కోట్ల గ్రాస్ 
  • వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్


ప్రశాంత్ వర్మ - తేజ సజ్జా కాంబినేషన్లో రూపొందిన 'హను మాన్' సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను రిలీజ్ చేశారు. నిన్నటితో ఈ సినిమా విడుదలై 4 రోజులైంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 

ఈ సినిమా నుంచి టీజర్ .. ట్రైలర్ ఎప్పుడైతే బయటికి వచ్చాయో, అప్పటి నుంచి అమాంతంగా అంచనాలు పెరిగిపోయాయి. అందువలన పెద్ద సినిమాలతో పోటీపడుతూ ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగింది. కథ నేపథ్యంలో హనుమంతుడిని చూపిస్తూ, పిల్లల నుంచి పెద్దలవరకూ వినోదాన్ని పంచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

హీరో పాత్రను .. విలన్ రోల్ ను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉండటం, గ్రామీణ నేపథ్యంలో నడిచే కథలోని సహజత్వం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. ఫొటోగ్రఫీ .. వీఎఫ్ ఎక్స్ .. నేపథ్య సంగీతం ఈ సినిమా ఈ స్థాయిలో కనెక్ట్ కావడానికి కారణమయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లాంగ్ రన్ లో ఈ సినిమా వసూళ్లు ఎంతవరకూ వెళతాయనేది చూడాలి.

More Telugu News