Narendra Modi: ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ... లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు

Modi visits Lepakshi temple

  • పుట్టపర్తిలో మోదీకి ఘనస్వాగతం పలికిన బీజేపీ నేతలు
  • లేపాక్షి వీరభద్రస్వామిని దర్శించుకున్న మోదీ
  • అనంతరం NACIN ప్రారంభోత్సవం కోసం పాలసముద్రం పయనంః

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏపీ పర్యటనకు వచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రంలో నెలకొల్పిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొంటారు. 

ఈ మధ్యాహ్నం పుట్టపర్తి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. అక్కడ్నించి ప్రధాని మోదీ లేపాక్షి బయల్దేరి వెళ్లారు. అక్కడ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా స్వామివారికి మోదీ స్వయంగా హారతిపట్టారు. ఈ సందర్భంగా అర్చకులు మోదీకి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రధాని రాక నేపథ్యంలో ఆలయంలో తోలు బొమ్మలాట కళారూపం ద్వారా రామాయణ ఘట్టాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని మోదీ ఆసక్తికరంగా తిలకించారు.

అనంతరం, అక్కడ్నించి మోదీ NACIN ప్రారంభోత్సవం కోసం పాలసముద్రం బయల్దేరి వెళ్లారు. NACIN ను ప్రారంభించాక అక్కడే మోదీ దాదాపు గంటన్నర పాటు గడపనున్నారు.

Narendra Modi
Lepakshi
Veera Bhadra Temple
Palasamudram
NACIN
Sri Sathyasai District
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News