Ben Duckett: భారత్‌తో టెస్ట్ సిరీస్ మొదలు కానున్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Interesting comments of the England opener in the background of the start of the Test against India

  • భారత పిచ్‌లపై రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేసిన ఇంగ్లిష్ ఓపెనర్ బెన్ డకెట్
  • అశ్విన్ లాంటి తెలివైన బౌలర్ తనను ఔట్ చేయగలడని వ్యాఖ్య
  • గత కొన్నేళ్లలో పరిణతి చెందానని పేర్కొన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జనవరి 25 నుంచి మొదలుకానుంది. హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు ఇప్పటికే సన్నాహకాలను మొదలుపెట్టాయి. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో ఆడని టీమిండియా ఆటగాళ్లు రంజీ ట్రోఫీ ఆడుతున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు అబుదాబి శిక్షణా శిబిరంలో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సిరీస్ ఆరంభానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్లకు భారత స్పిన్నర్ల నుంచి సవాలు ఎదురుకానుందని భావిస్తున్నట్టు చెప్పాడు. అయితే ఉపఖండ పరిస్థితుల్లో తాను చాలా మ్యాచ్‌లు ఆడానని, రాబోయే సిరీస్‌లో రాణిస్తున్నానని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలే పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో రాణించి జట్టులో స్థిరమైన చోటు సంపాదించుకున్న బెన్ డకెట్ ‘స్కై స్పోర్ట్స్ క్రికెట్‌’తో మాట్లాడాడు.

గత కొన్నేళ్లుగా క్రికెట్ లో చాలా నేర్చుకున్నానని, బ్యాట్స్‌మెన్‌గా పరిణతి చెందానని డకెట్ చెప్పాడు. టీమిండియా బౌలర్లు ఎలాంటి బంతులు సంధించినా సమర్థవంతంగా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశాడు. ఉపఖండ పిచ్‌లపై బ్యాటింగ్ చేసిన అనుభవం తనకు కలిసొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత కొన్నేళ్లుగా తాను చాలా పరిణతి చెందినప్పటికీ అశ్విన్ లాంటి తెలివిగల వ్యక్తి తనపై పైచేయి సాధించగలడని డకెట్ పేర్కొన్నాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ను తానొక్కడినే కాదని, అతడు చాలా బాగా బౌలింగ్ చేయగలడని అన్నాడు. ‘‘అశ్విన్ నన్ను మళ్లీ ఔట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. అతడు ప్రపంచ స్థాయి బౌలర్. అయితే నేను దూకుడుగా ఆడకుండా లేదా స్వీప్ చేయకుండా జాగ్రత్తగా ఆడతాను’’ అని చెప్పాడు.

  • Loading...

More Telugu News