Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా కుటుంబంలో విషాదం

Amit Shah lost his elder sister

  • తుదిశ్వాస విడిచిన అమిత్ షా పెద్దక్కయ్య రాజేశ్వరి బెన్ షా
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరి
  • ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స
  • పరిస్థితి విషమించడంతో కన్నుమూత
  • అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అమిత్ షా సోదరి రాజేశ్వరి బెన్ షా కన్నుమూశారు. ఆమె వయసు 60 సంవత్సరాలు. రాజేశ్వరి బెన్ షా... అమిత్ షా పెద్దక్కయ్య. 

ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కాగా సోదరి మృతితో కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర విచారానికి గురయ్యారు. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న ఆయన గుజరాత్ కు చేరుకుని సోదరి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్ లోని తల్తేజ్ శ్మశానవాటికలో రాజేశ్వరి బెన్ షా అంత్యక్రియలు నిర్వహించారు. 

అంతకుముందు, ఆమె భౌతికకాయాన్ని ముంబయి నుంచి అహ్మదాబాద్ కు విమానంలో తరలించారు.

Amit Shah
Sister
Rajeswari Ben Shah
Demise
Ahmedabad
Gujarat
  • Loading...

More Telugu News