Akira-Adya: పవన్ కల్యాణ్ పాట బ్యాక్ గ్రౌండ్ తో అకీరా, ఆద్యలపై రేణూ దేశాయ్ పోస్టు

Renu Desai shares pics of Akira and Adya

  • బెంగళూరులో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న మెగా ఫ్యామిలీ
  • కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేస్తున్న అకీరా, ఆద్య
  • ఇన్ స్టాగ్రామ్ లో రేణూ దేశాయ్ ఆసక్తికర స్పందన

మెగా ఫ్యామిలీ మెంబర్స్ సంక్రాంతి వేడుకలను బెంగళూరులో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈసారి పవన్ కల్యాణ్ తనయుడు అకీరా, కుమార్తె ఆద్య కూడా బెంగళూరులో సందడి చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, అకీరా, ఆద్యలకు సంబంధించిన ఫొటోను వారి తల్లి రేణూ దేశాయ్ పంచుకున్నారు. ఆ ఫొటోలను ఓ స్లైడ్ గా చేసి పవన్ కల్యాణ్ పాటను జతచేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఆ పాట పవన్ కల్యాణ్ నటించిన 'అన్నవరం' చిత్రంలోనిది. "అన్నలోని ప్రాణం నువ్వమ్మా... చిట్టి చెల్లెమ్మా... చెల్లిపోని బంధం నేనమ్మా" అంటూ అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటేలా ఆ పాట ఉంటుంది. 

ఇప్పుడీ పాటను రేణూ దేశాయ్... తన పిల్లలు అకీరా, ఆద్యలకు అన్వయించారు. "ఎట్టకేలకు వాళ్ల నాన్న పాట వారి జీవితాల్లోకి వచ్చేసింది. రీల్ లైఫ్ లో కాదండీ... రియల్ లైఫ్ లోనే. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు" అంటూ రేణూ తన పోస్టులో పేర్కొన్నారు.

Akira-Adya
Pawan Kalyan
Renu Desai
Mega Family
Sankranti
Tollywood

More Telugu News