Ayodhya Ram Mandir: పహారీ భాషలోకి అనువదించి రామ్ భజనను ఆలపించిన కశ్మీరీ ముస్లిం అమ్మాయి

Kashmiri Muslim girl songs Ram Bhajana in Pahari Language
  • రామ్ భజనను ఆలపించిన బటూల్ జెహ్రా అనే 19 ఏళ్ల యువతి
  • జుబిన్ హిందీలో పాడిన రామ్ భజన తనకు ప్రేరణ అన్న యువతి
  • లెఫ్టినెంట్ గవర్నర్ హిందూ అయినా అభివృద్ధిలో మతాన్ని చూడరని ప్రశంస
ఓ కశ్మీరీ ముస్లిం యువతి పాడిన రామ్ భజన నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ మహత్తర ఘట్టం కోసం కోట్లాది మంది వేచి చూస్తున్నారు. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రాముడు... రామమందిరం గురించే చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఓ ముస్లిం యువతి పాడిన రామ్ భజన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జమ్ము కశ్మీర్‌కు చెందిన సయ్యద్ బటూల్ జెహ్రా అనే 19 ఏళ్ల యువతి పహారీ భాషలో రామ్ భజనను ఆలపించింది. ఆమె పాట నెటిజన్ల మనసును గెలుచుకుంది. 

సోమవారం ఆమె మాట్లాడుతూ... గాయకుడు జుబిన్ నౌటియాల్ హిందీలో పాడిన రామ్ భజన తనను పాడేందుకు ప్రేరేపించిందని తెలిపారు. యూట్యూబ్‌లో హిందీలో జుబిన్ పాడిన రామ భజనను చూశానని... తొలుత హిందీలో పాడానని, బాగా నచ్చిందని.. దీంతో పహారీ భాషలో పాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దానిని హిందీ నుంచి పహారీలోకి అనువదించి రామ్ భజన పాడానన్నారు. తాను ముస్లి అయినప్పటికీ రామ్ భజన పాడటం తప్పేమీ కాదన్నారు.

తమ లెఫ్టినెంట్ గవర్నర్ ఓ హిందూ అని.. కానీ ఆయన అభివృద్ధి విషయంలో మతాన్ని చూడరని తెలిపారు. హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు అందరూ సోదరులేనని తాను నమ్ముతానని పేర్కొన్నారు.
Ayodhya Ram Mandir
Ayodhya Temple Trust
Ayodhya Ram Temple
Jammu And Kashmir

More Telugu News