Chandrababu: నారావారిపల్లె చేరుకున్న చంద్రబాబు, లోకేశ్... ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు

- ఈ ఉదయం పవన్ తో కలిసి భోగిమంటలు కార్యక్రమంలో పాల్గొన్న బాబు
- అనంతరం లోకేశ్ తో కలిసి స్వగ్రామం పయనం
- నారావారిపల్లెలో గ్రామదేవతకు పూజలు చేయనున్న టీడీపీ అధినేత
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమ స్వగ్రామం నారావారిపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ లకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఇంతకుముందే నారావారిపల్లె చేరుకున్నారు. చంద్రబాబు, లోకేశ్ నిన్న ఉండవల్లిలో పవన్ కల్యాణ్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ ఉదయం చంద్రబాబు, పవన్ భోగిమంటలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు, లోకేశ్ హెలికాప్టర్ లో స్వగ్రామం నారావారిపల్లె బయల్దేరారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు. గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేయనున్నారు.





